సినిమా వార్తలు

స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్న నయనతార…!?

Nayanthara Vignesh Shivan Marriage Clarity

తెలుగులో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అనగానే అందరికీ ముందుగా అనుష్క గుర్తొస్తుంది. అదే తమిళంలో అయితే నయనతార గుర్తొస్తుంది. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోల మాదిరిగానే తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరచుకుంది నయనతార. అందుకే స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం కూడా అందుకుంటోంది. అంతేకాదు ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను అభిమానులు, ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఇటీవల నయనతార నటించిన “కొలమావు కోకిల” చిత్రం విడుదలైంది.

ఈ నెల 17న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకొని హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. విడుదలైన 10 రోజుల్లోనే 20 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది “కొలమావు కోకిల”. ఇలా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదల రోజున తమిళ అగ్ర హీరోలైన అజిత్, విజయ్ ప్రత్యేక ప్రదర్శనలు, మరుసటి రోజు రజినీకాంత్, దర్శకుడు శంకర్ కూడా ప్రత్యేక షోలు వేయించుకుని మరీ చూశారు. ఆ తరువాత నయనతారను ప్రసంశలతో ముంచెత్తారు. ఇంతకుముందు నయనతార “మాయా, డోరా, ఆరం” వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది.

Related posts

ఇక నేను దుక్కి దున్ని పొలం పండించాలనుకుంటున్నా… మంచు మనోజ్

nagaraj chanti

‘నా గుండె దోచుకుంది ఇలా’ అంటూ చైతూ… మరింత వైరల్ గా మారింది

nagaraj chanti

అందుకే రామారావు "ప్రజా" నాయకుడు

admin

Leave a Comment