telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ప్రమోషన్ పై .. సెంటిమెంట్ తో .. నయనతార.. వస్తే ఫట్టేనట..

nayanatara agreed to promote syeraa

సినిమా షూటింగ్ కంప్లీటయ్యాక ప్రొమోషన్స్ కి టీం వెళ్తుండటం చాలా సహజం. ఈ టీం లో ముఖ్యులు ఖచ్చితంగా ఉంటారు.. అంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత తదితరులు. కానీ కొందరు బిజీగా ఉండి రాకపోవటం లాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా అసలు ప్రమోషన్స్ కి దూరంగా ఉండే నటిగా నయనతార పేరుతెచ్చుకుంది. అలా ఎందుకు అంటే, ఆమె ప్రమోషన్స్ కి వస్తే ఆ చిత్రం అపజయం అవుతుందని సెంటిమెంట్ అంటుంది నయన్. ఇన్ని రోజులు ఆ స్టార్ హీరోయిన్ సినిమా ప్రచారానికి రాదంటూ చాలామంది ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేశారు. కోట్ల ల్లో రెమ్యునిరేషన్ తీసుకుంటుంది గాని ఆ సినిమా ప్రమోసనల్ యాక్టివిటీస్ కు మాత్రం హాజరు కాదని నిందలు వేశారు. స్టార్ హీరోలను కూడా నయనతార పట్టించుకోదంటూ వాళ్ళకు వాళ్ళే డిసైడయ్యారు. అలాంటి మాటలన్నింటికీ చెక్ పెట్టేందుకు, ఇకపై తనను ఎవరూ సినిమాల ప్రమోషనల్ యాక్టివిటీస్ కు పిలవకుండా ఉండేందుకు నయనతార ఒక అద్బుతమైన సమాధానాన్ని ఇచ్చి అందరికి షాకిచ్చింది.

తను ఏ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నయనతార అసలు విషయం బయటపెట్టి అందరికి క్లారిటి ఇచ్చింది. గతంలో ఒక సినిమా ఆడియో రిలీజ్ కు వెళ్లానని, ఆ సినిమాలో నటించినందుకు గానూ అలా ప్రమోషన్ చేసినట్టుగా నయనతార చెప్పింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందని, ఆ తర్వాత తను ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొనని సినిమాలు అన్ని హిట్ అవుతూ వస్తున్నాయని నయనతార చెప్పింది. అందుకే తను కొన్నేళ్లుగా ఏ సినిమా ప్రచార కార్యక్రమాలకి హాజరు కావడం లేదని నయన్ చెబుతోందట. ఈ క్లారిటిచాలు.. నయన్ తో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలు ఆ సినిమాల ప్రమోషన్ కు రమ్మని పిలవకుండా ఉంటారు. నయన్ వస్తే సినిమా ఫట్ అవుతుందని ఆమే చెబితే, ఇక ఆమెను ప్రచార కార్యక్రమాలకు పిలిచేవారు ఎవరుంటారు? అసలే ఇండస్ట్రీలో వాళ్ళకి బోలెడన్ని సెంటిమెంటులుంటాయి. అలాంటప్పుడు నయనతారను ప్రమోషన్స్ కి పిలిచే సాహసం ఎవరైనా చేస్తారు? మొత్తానికి విమర్శలకు మంచి జవాబు చెప్పింది.

Related posts