telugu navyamedia
సినిమా వార్తలు

“నయనాలు”…

ushodaya sundarimani poetry corner

ఆశతో.. . ఓకింత ధైర్యాన్ని 
కూడగట్టుకొని నిరీక్షిస్తున్నాయి 
నిశిరాత్రిలో నీ కోసం 
అన్వేషిస్తున్నాయి
ఎడబాటును తట్టుకోలేక 
ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి 

ఓదార్పు కు నోచుకోక
ఓర్చుకొని ఉండలేక 
ఉర్వి జనులలో ఇమడలేక 
కాసిన్ని కన్నీళ్లు కళ్ళలోనే 
కకా వికలమౌతుంటే 
కనికరం లేదా  కాస్తైన 

మనసు ఉవ్విళ్లూరుతుంది 
దిగులు దాహర్తిని తీర్చడానికి 
దగ్గరౌతావని ఆశ తో 
అందుకే నా నయనాలు నీకోసం 
దీనంగా ఎదురు చూస్తున్నాయి 

-పాపారావు, ముత్తనపల్లి 

Related posts