telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లండన్‌లో నవాజ్ షరీఫ్..అరెస్ట్‌ వారెంట్ జారీ

Nawaz Sharif

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. అవెన్ ఫీల్డ్ ఆస్తులు, అల్ అజీజియా స్టీల్ మిల్లు కేసుల్లో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్‌కు డిసెంబరు 2018లో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిలిచ్చిన లాహోర్ కోర్టు వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు గతేడాది నవంబరులో అనుమతించింది.

లండన్‌ నుంచి ఎనిమిది వారాల్లో తిరిగి రావాలని ఆదేశించినప్పటికీ అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తిరిగి స్వదేశం రాలేకపోయినట్టు నవాజ్ న్యాయవాది తెలిపారు. దీంతో నవాజ్‌ను అరెస్ట్ చేసేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా లండన్‌లో ఉంటున్న షరీఫ్‌ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది.

Related posts