వార్తలు & టిప్స్

ఎండలు మండిపోతున్నాయి… జనం మాడిపోతున్నారు…

వేసవికాలం మొదలైంది… ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నిన్న కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతలా ఎండలు మండిపోవడానికి పర్యావరణ కాలుష్యమే ముఖ్యకారణం అని చెప్పవచ్చు.

Summer

రోజురోజుకు మండిపోతున్న ఈ ఎండల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఇక ఖచ్చితంగా బయట తిరగాల్సిన పరిస్థితి వస్తే తలకు టోపీ ధరించడమో, లేదా క్లాత్ ధరించడమో చేయాలి. సూర్యరశ్మి నుంచి కళ్ళను కాపాడుకోవడానికి కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉంటే మంచిది.

అయితే రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ ఎండలు చర్మంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా రాసుకోవాలి. సరైన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ తగిలే అవకాశముంది. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినాలి.

Summer

వేసవి కాలంలో వేడినీటి స్నానానికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వేడినీళ్ళతో స్నానం చేయడం వల్ల శరీరం పొడిగా తయారవుతుంది. అందుకే చన్నీళ్ళ స్నానమే ఉత్తమం.

ఒదులుగా ఉండే బట్టలు ధరించడం మంచిది. వీటివల్ల శరీరానికి సరైన విధంగా గాలి ప్రసరణ జరిగి, చెమట, చిరాకు వంటి సమస్యలు ఉండవు.

Related posts

వేసవిలో తినకూడని ఆహార పదార్థాలు ఇవే…!

admin

వేసవి కాలంలో జుట్టు సమస్యలకు పరిష్కారాలివే…

admin

చుండ్రు తొలగించడానికి చిట్కాలు….!

admin

Leave a Comment