telugu navyamedia
news telugu cinema news

ఎన్టీఆర్ సినిమాలో ఆ యువ హీరో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆరఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అయినను పోయిరావలే సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌తో పాటుగా మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరో స్నేహితుని పాత్ర ఉందనీ, అందులో యువ హీరో నవీన్ పోలిసెట్టి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా నెగిటివ్ పాత్ర చేయనున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందంట. హీరో పాత్ర రాజకీయాల్లోకి కూడా అరంగేట్రం చేస్తుందంట. ఇదిలా ఉంటే నవీన్ పోలిసెట్టి ప్రస్తుతం జాతి రత్నాలు అనే కామెడీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ యువ హీరో ఎన్‌టీఆర్‌లో చేస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related posts

భోగి వేడుకలలో .. ప్రముఖులు…

vimala p

ప్రేమలో పడిన రానా… సోషల్ మీడియాలో ప్రియురాలి ఫోటో పోస్ట్

vimala p

సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చిన సీఎం కేసీఆర్

vimala p