telugu navyamedia
సినిమా వార్తలు

తమిళ రాకర్స్ జిందాబాద్ అంటున్న హీరో నవీన్ చంద్ర

hERO hEROINE tEASER

తమిళ రాకర్స్ ఈ పేరు వింటేనే నిర్మాతల గుండెల్లో దడ పుడుతుంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే మూవీని యదేచ్చగా పైరసీ చేసి నెట్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు ఈ తమిళ రాకర్స్ సంస్థ. అయితే దీనికి జిందాబాద్ కొడుతున్నాడు మన తెలుగు హీరో. ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి,రీల్ లైఫ్‌లో. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నవీన్ చంద్ర ప్రస్తుతం జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో హీరో హీరోయిన్ అనే సినిమా చేస్తున్నాడు.

 

గాయత్రి సురేశ్‌, పూజా జవేరీ కథానాయికలు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇందులో ‘మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే..’ అంటూ నవీన్‌ చంద్ర తొలి డైలాగ్ చెప్పగా, ఆ తర్వాత ‘ప్రొడ్యూసర్‌ కూతురివైతే నాకేంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అని నవీన్‌ చంద్ర తన ప్రేయసితో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. చివరిలో తమిళ రాకర్స్ జిందా బాద్ అంటూ గట్టిగా అరుస్తాడు. మొత్తానికి టీజర్‌ని బట్టి చూస్తుంటే ఈ చిత్రం పైరసీతో ముడిపడిన ఓ ప్రేమకథా చిత్రంగా రూపొందినట్టు తెలుస్తుంది.

అభిమన్యు సింగ్‌, కబీర్ దుహన్‌ సింగ్ చిత్రంలో ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. చాలా గ్యాప్ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తున్న నవీన్ చంద్రకి ఈ సినిమా మంచి పేరు తేవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts