telugu navyamedia
సినిమా వార్తలు

నవరాగ మాలికా!!

bhuvi devi poetry corner
హృదయ వీణపై
ప్రేమ రాగాలు పలికించి
పులకింప చేస్తావు.
ప్రణయ గీతాలు వినిపించి
వీనులవిందు చేస్తావు
నెలవంక వోలె నా వంక చూసి
ఓరచూపుల వెన్నెల కురిపిస్తావు
అధరాల తంబుర సితార  
 ప్రేమ నాదాలతో
మనసు మందిరాన్ని
పరవశింప చేస్తావు.
వలపుల తలపుల వాయిద్యాలతో
నవనాడులను కదిలిస్తావు
పరువాల వాకిట్లో పండుగే చేస్తావు.
నవరాగ మాలికా!
నా ప్రేమ దీపికా!!
అందుకో! ప్రేమ నీరాజనాలు
నీవున్న జీవితమే నాకదియే చాలు
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts