telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నవ రత్నాలు

devadasu poetry corner

1
అందమైన గూడు
గిజిగాడు సొంతం!
పేటెంట్ మాత్రం
ప్రకృతి దే!!

2.

కాయలు ఎవరో
కోసుకు పోయారు!
అయినా పచ్చగా
నవ్వుతున్నాయి చెట్లు!!

3.

రాత్రి అందరూ హాయిగా
నిద్ర పోతున్నారు!
తాగారు మరి
వెన్నెలపాలు!!

4.

ముఖం కడిగి
పుక్కిలించాయేమో!
పరిమళం వెదజల్లతూ
చిగుళ్ళ నోళ్ళు!!

5.
కొన్ని నెత్తురు చుక్కలు
ఒక గాయం!
కొన్ని వాస్తవాలు
ఒక అనుభవం!!

6.

మతి మరుపా ఏమి
సూర్యునికి ?
మనపై ఎండ తివాచీ పరచి
తీయడేమి??

7.

తీసుకుని ఇవ్వట్లా
ఎప్పుడిస్తుందో చెప్పట్లా!
ఐపీ పెట్టిందేమో
ఆకాశం!!

8.
నరికిన గొడ్డలికి
పసరు వైద్యం!
ఉదారత్వం అంటే
చెట్టుదే!!

9.
గాయాలు భరించింది
గేయమై గెలిచింది!
ఓర్పుతో
వేణువు అందలమెక్కె!!

🙏సైదులు ఆరేపల్లి 🙏

Related posts