telugu navyamedia
health news Sexual Problems trending

శృంగార సామర్ధ్యానికి.. ఈ ‘గ్రా’మర్ సరిపోద్ది..

Benefits of sex

కాలానుగుణంగా జీవన శైలిలో వచ్చిన మార్పులతో నిత్యజీవితంలో కూడా అనేక సమస్యలు తప్పడంలేదు. దానికి పరిష్కారం కోసం అనేక మంది అనేక దారులు వెతుకుతున్నారు. అయితే అవన్నీ తాత్కాలిక పరిష్కారాన్ని ఇస్తూ, అనేక సైడ్ ఎఫెక్ట్ లు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కాకుండా, ప్రకృతిలో సహజసిద్ధంగా లబించేవాటిని శరీరానికి అందించడం వలన కలిగే ప్రయోజనాలే వేరు. ప్రకృతిలో సహజసిద్దంగా లభించే కొన్ని పదార్థాలతో దంపతులతో శృంగార శక్తిని(వయా’గ్రా’ వంటివాటికంటే, సహజసిద్దమైనవి వాడటం దీర్ఘకాలానికి కూడా మంచిది) పెంచుకోవచ్చు. అంతేకాకుండా శృంగారం ఆనందాన్ని, సంతృప్తినే కాదు అనేక రకములైన అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడేస్తుందనీ కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరి అలాంటి విషయాలు ఏమితో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం..

* శృంగార సామర్థ్యం పెంచుకోడానికి బీట్రూట్‌ను తినాలి. దీనిలో ఉండే ట్రిప్టోఫాన్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది.

* పురుషుల్లో కాస్త వయసు అయ్యాక టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. అయితే బ్రోకలీ శరీరంలో టెస్టోస్టెరోన్‌ను పెంచేందుకు బాగా సహకరిస్తుంది. పురుషుల్లో హార్మోన్లను పెంచే గుణం బ్రోకలీకి ఉంటుంది. రోజూ దీన్ని తింటూ ఉంటే శృంగారపరమైన శక్తిని సహజంగా పొందుతారు.

* దానిమ్మ శృంగార శక్తిని బాగా పెంచుతుంది. ప్రతిరోజు ఒక దానిమ్మ తింటే రాత్రంతా శృంగారంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు.

* గుమ్మడికాయ గింజలు శృంగారపరమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. వీటిల్లో జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లైంగిక హార్మోన్-స్థాయిలను పెంచుతాయి.

* శృంగారంలో రెగ్యులర్‌గా పాల్గొంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇలా పాల్గొనడం వల్ల యాంటీబాడీ ఇమ్యునోగ్లోబులిన్ పెరుగుతుంది. దీనితో సాధారణ జలుబు, జ్వరం వంటి అనారోగ్యాల బారినపడకుండా ఉండగలుగుతారు.

* శృంగారంలో తరుచూ పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. రెగ్యులర్‌గా పాల్గొనేవారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారని పరిశోధనల్లో తేలింది.

* శృంగారంలో పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది విడుదల కావడం వల్ల సాధారణ సమయంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా, ఏమయినా నొప్పులు ఉంటె, వెంటనే తగ్గుతాయి.

Related posts

స్వయంతృప్తి మంచిదేనా ?

ashok

మార్చి 10న చంద్రబాబు బయోపిక్ విడుదల!

vimala p

అదుపు తప్పిన విమానం… విమానం కింద మనిషి

vimala p