telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

తిరుపతి : సహజ శిలగా .. అభిషేకాలు ఆడుకుంటూ.. వేంకటనాధుడు..

natural stone form venkateswaraswamy

తిరుమల క్షేత్రంలో సహజ శిల స్వామిగా వెలసినటువంటి శ్రీవేంకటేశ్వరస్వామికి, ఇల వైకుంఠం అయిన అఖిలాండ బ్రహ్మాండ కోటి రాయుడికి తెలుగు నూతన వికారి నామ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా ఇవాళ గజమాల వేసి అభిషేకం నిర్వహించారు. తిరుమలలోని స్థానిక భక్తులు పవిత్రమైన ఆకాశ గంగా నీటితో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేసి పుష్పాలతో తయారు చేసిన గజమాలను స్వామి వారికి అలంకరించారు.

అభిషేకం సమయంలో మహాద్భుతం, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రియమైన వాహనం అయిన గరుడ పక్షి సహజ శిలా స్వామివారికి అభిషేకం చేసి స్వామి వారిని దర్శించుకుంటుంది. ఇవాళ కూడా స్వామివారికి అభిషేకం చేస్తున్న సమయంలో గరుడ పక్షి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నది. ఈ ఘట్టాన్ని చూసిన భక్తులు పులకరించిపోయారు.

Related posts