telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

చక్కటి సహజసిద్ధ .. ముఖసౌందర్యం కోసం..

natural face pack for clear skin

సహజసిద్ధంగా అందాన్ని మెరుగుపరుచుకోవాలి అనే విషయాలు చాలా మందికి తెలియక రకరకాల రసాయనిక క్రీములు పూసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుంటారు. అయితే ఇంట్లో వాడే పదార్ధాలతోనే అద్భుతమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్వం నుంచీ వాడుకలో ఉన్న సహజసిద్ద ఫేస్ మాస్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మాస్క్ ని ఉదయం పూట అంటే వేకువ జామునే వేసుకుంటే మరింత ప్రతిఫలం ఉంటుంది. ఇళ్ళలో సహజంగా తయారు చేసుకునే వెన్న తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత వెన్నని కరిగించాలి. అందులో ముద్ద కర్పూరం తీసుకుని తగినంత మెత్తగా చేసి వేయాలి.

ఈ రెండిటిని కలపడం వలన వచ్చిన మిశ్రమంలో స్వచ్చమైన పసుపు వేయాలి. అయితే కొంతమందికి పసుపు పడక పోవచ్చు అలాంటి వారు మంచి గంధం వేసుకోవచ్చు. ఆ తరువాత అందులో రెండు స్పూన్ల నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు అలానే ఉంచి ఆ తరువాత ముఖానికి బాగా పట్టించాలి. సుమారు 30 నిమిషాలు ఉంచి స్నానం చేసేయాలి. ఇలా నెలలో మూడు సార్లు చేస్తే తప్పకుండా ముఖంపై మొటిమలు, ముడతలు, మచ్చలు పోవడమే కాకుండా ఎంతో అందమైన ముఖాన్ని సొంతం చేసుకుంటారు.

Related posts