telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

8 నుండి .. దేశవ్యాప్తంగా.. కార్మిక సంఘాల సమ్మె… మోగిన సైరన్..

national labour unions to protest on

కేంద్రప్రభుత్వ పాలనా విధానాలు అన్ని వ్యవస్థలను సర్వవిధాలా నాశనం చేశాయని, కార్మిక సంఘాలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. దీనితో ఈ సంఘాలు సమ్మెకు సిద్ధం అయ్యాయి. దేశవ్యాప్తంగా, కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ, ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగాలని ఐఎఫ్టీయూ నిర్ణయించింది. ఈ సమ్మెలో అన్ని రాష్ట్రాల కార్మిక సంఘాలు, కార్మికులు పాల్గొనాలని ఐఎఫ్టీయూ తెలంగాణ కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ కోరారు.

దీనిలో భాగంగా, సమ్మెకు వాల్‌ పోస్టర్‌ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ నరేందర్‌, సహాయ కార్యదర్శి బీ అనురాధ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను చేపట్టినట్టు తెలిపారు. కార్మికుల కనీస వేతనం రూ. 18 వేలుగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ రక్షణ, రైల్వే, బ్యాంకు, రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించరాదని అన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేసి, కార్మికలోకం సత్తాను కేంద్రానికి చాటడం ద్వారా ఒత్తిడిని పెంచుతామని తెలిపారు

Related posts