telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

డెడ్ అయిన .. నాసా ఆపర్ట్యూనిటీ రోవర్..

nasa apartunity rover died is confirmed

అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసా 15 ఏళ్ల క్రితం రెడ్ ప్లానెట్ అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ఆపర్ట్యూనిటీ రోవర్ కథ ముగిసింది. గతేడాది అంగారక గ్రహంపై భారీ ఇసుక తుపానులో చిక్కుకున్న రోవర్ అప్పటి నుంచి స్తబ్ధుగా మారింది. గత ఎనిమిది నెలలుగా ఎటువంటి కదలికలు లేకుండా ఉండడంతో అది ‘డెడ్’ అయినట్టు నాసా ప్రకటించింది.

దానిని తిరిగి పనిచేయించేందుకు 800 సార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో దాని కథ ముగిసినట్టుగా ప్రకటించినట్టు నాసా తెలిపింది. దీంతో 2020లో మరో కొత్త రోవర్‌ను మార్స్‌పైకి పంపనున్నట్టు తెలిపింది.

Related posts