telugu navyamedia
రాజకీయ వార్తలు

అభివృద్ధి అవకాశాల కల్పనకు పెద్దపీట: మోదీ

modi on jammu and kashmir rule

పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. బడ్జెట్ లో అభివృద్ధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి కావాల్సిన నైపుణ్యాలపై దృష్టి పెట్టామని చెప్పారు. విదేశాలకు వెళ్లేవారి కోసం బ్రిడ్జ్ కోర్సులు, ఆన్ లైన్ కోర్సులు, ఇంటర్న్ షిప్ విధానాలు అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు.

బడ్జెట్ లో స్మార్ట్ సిటీలు, డేటా సెంటర్ పార్కులు వంటి అనేక అంశాలకు చోటిచ్చామని తెలిపారు. భారత్ లో వైద్య పరికరాల తయారీకి ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు . వాటి వినియోగానికి తోడ్పడే బడ్జెట్ రూపొందించామని చెప్పారు. దేశ ఆరోగ్య రంగానికి ఆయుష్మాన్ భారత్ కొత్త దశను నిర్దేశిస్తుందని అన్నారు. ఆక్వా విప్లవంతో మత్స్యపరిశ్రమలో విస్తృత అవకాశాలకు వీలవుతందని పేర్కొన్నారు. యువకు ఉపాధి, పరిశ్రమల్లో పెట్టుబడులకు అవకాశాలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ప్రధాని వెల్లడించారు.

Related posts