telugu navyamedia
రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రశంసించిన మోదీ

narendra-modi

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందులను త‌గ్గించేందుకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రుణ చెల్లింపుల‌పై మూడు నెల‌ల మార‌టోరియం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆర్బీఐ ప్రకటన చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించేందుకే ఆర్బీఐ ఇవాళ భారీ చర్యలు తీసుకుందని తెలిపారు. ఆర్బీఐ తాజా ప్రకటన వల్ల ద్రవ్య లభ్యత పెరగడమే కాకుండా, నిధులపై వ్యయం తగ్గుతుందని, తద్వారా మధ్యతరగతి ప్రజలకు, వ్యాపారవర్గాలకు ఊతం లభిస్తుందని ప్ర‌ధాని పేర్కొన్నారు.

Related posts