telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

దక్షిణాది తారలను కూడా గుర్తించండి..మోదీపై ఖుష్బూ విమర్శలు

kushboo congress

ప్రధాని మోదీ కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ తారలకు తన నివాసంలో ఆతిథ్యం అందించారు. ‘చేంజ్ విత్ ఇన్’ అనే కార్యక్రమంలో భాగంగా మోదీ బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అయితే ప్రధాని వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. భారత చలనచిత్ర రంగం అంటే హిందీ సినిమా రంగం ఒక్కటే కాదన్న విషయాన్ని ప్రధానమంతి కార్యాలయం గుర్తించాలని ప్రముఖ నటి ఖుష్బూ హితవు పలికారు.

భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం అందిస్తోంది హిందీ చిత్రపరిశ్రమ ఒక్కటే కాదని, దక్షిణాది చిత్రపరిశ్రమల నుంచి కూడా భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా తోడ్పాటు అందుతోందని ఖుష్బూ తెలిపారు. ఎంతోమంది సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి వచ్చారని, ఎందుకు ‘చేంజ్ విత్ ఇన్’ కార్యక్రమానికి దక్షిణాది ప్రముఖులను పిలవలేదని ప్రశ్నించారు. ఇది దక్షిణాదిపై వివక్ష చూపించడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధాని నిర్వహించిన ‘చేంజ్ విత్ ఇన్’ కార్యక్రమంలో టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.

Related posts