telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని మోదీకి అవార్డు ప్రకటించిన రష్యా

PM Modi says India is great

ఎన్నికల వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక దేశ అత్యుత్తమ పౌర అవార్డు లభించింది. ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్య్రూ ది అపోస్టల్‌’ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోదీని గౌరవించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. .మోదీకి ఈ అవార్డును ప్రకటించేందుకు శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆదేశాలు జారీ చేస్తూ సంతకం చేశారు.

ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మోదీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆ దేశం ఈ అవార్డును ప్రకటించింది. మోదీకి అంతర్జాతీయ అవార్డు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ‘ జయేద్‌ మెడల్‌’ను మోదీకి ఇచ్చిన సంగతి తెల్సిందే.

Related posts