telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మన కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి: మోదీ

modi speech on J & K

మన కళా నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన మన్‌ కీ బాత్‌లో మాట్లాడుతూ…పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని అన్నారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. బొమ్మల తయారీ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన కళాకారుల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని అన్నారు.

కరోనా సంక్షోభం సమయంలో రైతులు కష్టపడి సాగు చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ సాగు చేస్తున్నారని చెప్పారు. అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనదని నరేంద్ర మోదీ అన్నారు. మన వేదాల్లోనూ రైతులను గౌరవించే శ్లోకాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రతి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరారు.

Related posts