telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏ ఎవరి పౌరసత్వాన్నీ తొలగించదు: మోదీ

modi on jammu and kashmir rule

పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ) దేశంలోని ఎవరి పౌరసత్వాన్నీ తొలగించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్‌ మఠం వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ… పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్ష పార్టీల నేతలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

పాకిస్థాన్‌లోని మైనార్టీలకు భారత్‌లో పౌరసత్వం ఇవ్వాలని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీతో పాటు చాలా మంది గొప్ప నేతలు భావించారని తెలిపారు.ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ, రాజకీయ క్రీడలు ఆడుతోన్న కొందరు మాత్రం సీఏఏను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తున్నారన్నారు. సీఏఏ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మోదీ విపక్షాల పై మండిపడ్డారు.

Related posts