telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్యకు బయలుదేరిన మోదీ

Modi ayodya tour

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక జెట్ విమానంలో లక్నోకు బయలుదేరారు. సంప్రదాయబద్ధ వస్త్రధారణలో మోదీ లక్నో నుంచి హెలికాప్టరులో బయలుదేరి అయోధ్యలోని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగనున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రామాలయం భూమి పూజా స్థలానికి చేరుకుంటారు.

మోదీ తొలుత హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 12 గంటలకు భూమి పూజ నిర్వహించనున్న ప్రదేశానికి చేరుకుని 12.30 నుంచి 12.45 గంటల వరకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోదీతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు వేదికను పంచుకోనున్నారు. భూమిపూజ సందర్భంగా అయోధ్య మొత్తాన్ని ఎస్పీజీ బలగాలు తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. అయోధ్యను ఆనుకుని ఉన్న జిల్లాల్లోలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts