telugu navyamedia
రాజకీయ వార్తలు

అమిత్ షా గొప్ప కార్యదక్షకుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

modi campaign in maharastra

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. అమిత్ షా గొప్ప కార్యదక్షకుడు, అత్యంత అనుభవశాలి అని కితాబిచ్చారు. మన దేశ రక్షణ, సాధికారత విషయాల్లో అమిత్ షా భాగస్వామ్యం మహోన్నతమైనదని అన్నారు. నేడు అమిత్ షా పుట్టినరోజు. ఈ సందర్భంగా అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపిన మోదీ… ఆయనపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

నా కేబినెట్ సహచరుడు అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడే మనస్తత్వం, అనుభవం, కార్యదక్షత కలబోసిన గొప్ప వ్యక్తి అమిత్ షా అని అభివర్ణించారు. భారత ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తూనే… దేశ రక్షణ, సాధికారత అంశాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన నిండు జీవితాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ హిందీలో మోదీ ట్వీట్ చేశారు.

Related posts