telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటీమణులకు ఎన్సీబీ నోటీసులు

Bollywood

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వాడినట్లు, డ్రగ్స్ పెడల్స్‌తో తనకు కాంటాక్ట్స్ ఉన్నట్లు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ఒప్పుకోగా… రియా చక్రవర్తి వాంగ్మూలం మేరకు మరికొందరు బాలీవుడ్‌ తారలకు నోటీసులు ఇచ్చేందుకు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సీబీ) సిద్ధమవుతోంది. వారిలో నటి దీపికా పదుకొనే, ఆమె మేనేజింగ్‌ ఏజెన్సీకి చెందిన కరిష్మా, బాలీవుడ్‌ తారలు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్టా ఉన్నట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా విలేకరులకు చెప్పారు. దీపిక, కరిష్మాలకు మంగళవారమే ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 67 ప్రకారం సమన్లు జారీచేసి విచారిస్తామన్నారు.ఎన్‌సీబీ మరో నిందితుడిని ప్రశ్నిస్తున్న సమయంలో ‘డీకే’ అనే పొడి అక్షరాలు డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన చాటింగ్‌ గ్రూప్‌లో గుర్తించింది. డీ అంటే.. దీపికా పదుకొనే అని.. కే అంటే.. ‘క్వాన్‌’ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీకి చెందిన కరిష్మా అని గుర్తించారు. ఆమె దీపికాకు కూడా సేవలందిస్తున్నట్లు నిర్ధారించారు. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు అమృత్‌సర్‌, పాకిస్థాన్‌లకు లింకులు ఉన్నట్లు ఎన్‌సీబీ గుర్తించింది. శాండల్‌వుడ్‌లోనూ డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. బెంగళూరు సీసీబీ పోలీసులు తాజాగా యువనటుడు, కొరియోగ్రాఫర్‌ కిశోర్‌ అమన్‌ శెట్టి, అఖీల్‌ నౌషీల్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువ చేసే మాదక పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అటు.. కన్నడ నటి రాగిణి ద్వివేదీ, సంజనా గర్లానీ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు.

Related posts