telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కథానాయకుడు”పై నారా లోకేష్ ట్వీట్

దివంగత నందమూరి తారకరామారావు జీవితచరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ బయోపిక్”ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగమైన “కథానాయకుడు” చిత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. నిన్న ప్రీమియర్ షో చూసిన నందమూరి అభిమానులు సినిమా బాగుందంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమాపై బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “సామాన్య కుటుంబంలో జన్మించి వెండితెర ఇలవేల్పుగా ఎదిగి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించిన తాతగారి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన “కథానాయకుడు” సినిమా ఈరోజు విడుదలై అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మామయ్య బాలకృష్ణకు, చిత్ర బృందానికి అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు.

Related posts