telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెన్షన్ పెంచామని అసత్య ప్రచారం: నారా లోకేశ్

Lokesh Tdp

పెన్షన్ల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న విధానలాపై ని టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారి మోసాలు అన్నీ ఇన్నీ కావని లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 3 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత మాట తప్పి, మడమ తిప్పి ప్రతి ఏటా రూ. 250 పెంచుతామని అన్నారని గుర్తు చేశారు.

కానీ, జూలై నుంచి రూ. 2500 పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వ, తాత రూ. 1000 నష్టపోయారని చెప్పారు. సంక్షేమ క్యాలెండర్ లో అవ్వాతాతల పెన్షన్ పెంపు లేకపోవడం దారుణమని అన్నారు.

ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము రూ. 200 పెన్షన్ ని రూ. 2వేలకు పెంచామని తెలిపారు. వైసీపీ నేతలు మాత్రం రూ. 1000 పెన్షన్ ని రూ. 2250 చేశామని సిగ్గు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను పెంచాలని డిమాండ్ చేశారు.

Related posts