telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సెక్షన్లు దొరకక..ఆ కేసులు పెట్టారు : లోకేష్ సెటైర్

Lokesh Tdp

జగన్ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. “రైతుల్ని పరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం YS Jagan Mohan Reddy దృష్టిలో నేరం.ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు.అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా.” అని లోకేష్ పేర్కొన్నారు. కాగా.. ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తూ.. కొందరిని ట్రాక్టర్ ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వారి ప్రాణాలకు హాని కలిగించేలా అక్కడున్న రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు గాను నారా లోకేష్ పై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించి నందుకు ఆకివీడు పోలీసులు నారాలోకేష్ పై కేసు నమోదు చేశారు.

Related posts