• Home
  • వార్తలు
  • ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు: మంత్రి లోకేశ్

Nara lokesh, Ap minister, srikakulam

మోదీ ఆపరేషన్ గరుడలో భాగంగానే ఆంధ్రులపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. సీఎం రమేశ్ ఇళ్లు, కార్యాలయాలపై ఈ రోజు జరిగిన ఐటీ దాడులపై లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని నిలదీసినందుకు ఆంధ్రప్రదేశ్‌పై మోదీ కక్ష గట్టారని మండిపడ్డారు.

కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు అని ఉద్యమించినందుకే సీఎం రమేశ్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చెయ్యాలని.. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా హోదా సాధనలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతామని..హోదా సాధిస్తామని ట్విట్టర్‌లో లోకేష్‌ స్పష్టం చేశారు.

Related posts

మరింత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

jithu j

ఈ మాయ పేరేమిటో  చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది – కోన వెంక‌ట్‌

chandra sekkhar

స్నాతకోత్సవం లో చంద్రబాబు…

admin

Leave a Comment