telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

నేడు భువనేశ్వరి బర్త్ డే.. కేక్ తినిపించిన లోకేశ్

buvaneshwari lokesh

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరి పుట్టిన రోజు వేడుకను కుమారుడు లోకేశ్ స్వయంగా జరిపించారు. తల్లితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.“నాకు బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచినందుకు కృతజ్ఞతలు అమ్మా. నాకు కష్టపడి పని చేయడాన్ని నేర్పించావు.

దయాగుణాన్ని, క్షమాగుణాన్ని నేర్పించావు. ఎప్పుడూ నా క్షేమం కోరుకుని, నన్ను అంటిపెట్టుకునే ఉంటావు. ఎల్లప్పుడూ నా శ్రేయస్సును కోరుకునే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts