telugu navyamedia
సినిమా వార్తలు

హాలీవుడ్ లో నటించనున్న తొలి తమిళ నటుడు

Napoleon

ద‌క్షిణాది భాష‌ల‌లో వంద‌కి పైగా సినిమాలు చేసిన ప్ర‌ముఖ న‌టుడు నెపోలియ‌న్. ఆయ‌న తొలిసారిగా హాలీవుడ్‌లో న‌టించ‌బోతున్నారు. డెవిల్స్ నైట్‌, క్రిస్ట‌మ‌స్ కూప‌న్ అనే రెండు హాలీవుడ్ చిత్రాల‌లో న‌టించే అవ‌కాశం నెపోలియ‌న్‌కి ద‌క్కింద‌ని తెలుస్తుంది. క్రిస్ట‌మ‌స్ కూప‌న్ చిత్రం డానియ‌ల్ నుడ్సెన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా ఇందులో కోర్ట్నే మాథ్యూస్‌, ఆరోన్ నోబుల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో హాకీ ప్లేయ‌ర్ మేనేజ‌ర్ పాత్ర‌లో నెపోలియ‌న్ క‌నిపించ‌నున్నారు. హాలీవుడ్‌కి వెళ్ల‌బోతున్న తొలి త‌మీళియ‌న్‌గా ఆయ‌న కీర్తి పొందారు. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్నారు. ర‌జనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌కి శాలువా క‌ప్పి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు నెపోలియ‌న్. ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ ఎజామాన్ చిత్రంలో విల‌న్ పాత్ర పోషించారు నెపోలియ‌న్. చివ‌రిగా సీమ‌రాజా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌న్మోహ‌న్ క్యాబినేట్‌లో ఎంపీగా ప‌ని చేశారు నెపోలియ‌న్‌.

Related posts