telugu navyamedia
సినిమా వార్తలు

ననుచేరుమా…!

maharani poetry corner
ననుతాకిన పవనమా..
ఎదమీటిన కిరణమా..
ఇలచేరిన స్వప్నమా..
తుదివీడని బంధమా..
మనసిచ్చిన నేస్తమా..
మదిమెచ్చిన సర్వమా..
అలుపెరుగని గమనమా..
మలుపెరిగిన గమకమా..
తొలిసంధ్యల అరుణమా..
చలిమంచుల తరుణమా..
విధివరమై..
కలనిజమై..
దరిచేరుమా…
-విశ్వైక

Related posts