telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్” మా వ్యూ

Gang-Leader

బ్యాన‌ర్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు : నాని, ప్రియాంక‌, కార్తికేయ గుమ్మ‌కొండ‌, ల‌క్ష్మీ, శ‌రణ్య, శ్రియారెడ్డి, ప్రాణ్య‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.
సంగీతం: అనిరుధ్‌
సినిమాటోగ్ర‌ఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం)

వ‌రుస‌ సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని జోరుకు కృష్ణార్జున‌యుద్ధం, దేవ‌దాస్ చిత్రాలు బ్రేక్ వేశాయి. కానీ ఆ తరువాత “జెర్సీ”తో మరో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు నాని. తాజాగా ఈ యంగ్ హీరో దర్శకుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై “గ్యాంగ్ లీడర్” అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో నాని పెన్సిల్ పార్థ‌సార‌థి అనే ఓ క్యారెక్ట‌ర్‌లో కనపడనున్నారు. వేర్వేరు వ‌య‌సులున్న ఐదుగురు మ‌హిళ‌లు ప్రతీకారం తీర్చుకోవాల‌నుకుంటారు. దర్శకుడు విక్రమ్ కు “మనం” తరువాత మరో హిట్ రాలేదు. దాంతో ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి విక్రమ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకుందాం.

కథ :
సిటీలో ఆరుగురు కలిసి బ్యాంక్ దోపిడీకి పాల్పడతారు. ఆ దొంగను పోలీసులు పట్టుకోలేకపోతారు. తరువాత 14 నెలలకు స‌రస్వ‌తి (ల‌క్ష్మి).. మ‌ధ్య‌వ‌య‌స్కురాలైన వ‌ర‌ల‌క్ష్మి (శ‌రణ్య‌), పెళ్లి కాబోతున్న అమ్మాయి ప్రియ‌ (ప్రియాంక‌), స్కూల్ చ‌దువుతున్న అమ్మాయి స్వాతి (శ్రియారెడ్డి), ఐదారేళ్ల చిన్న‌పాప (పాణ్య‌)ల‌కు బహుమ‌తి వ‌చ్చింద‌ని అబ‌ద్ధం చెప్పి ఇంటికి ర‌ప్పిస్తుంది. పెన్సిల్ పార్థ‌సార‌థి (నాని) అనే వ్యక్తి డ‌బ్బింగ్ సినిమాల ర‌చ‌యిత. వీరంతా కలిసి పెన్సిల్ దగ్గరకు సహాయం కోసం వెళతారు. అసలు వీళ్లంతా ఎవరు ? వీళ్ళకు, పెన్సిల్ కు ఉన్న సంబంధం ఏంటి ? పెన్సిల్ వారికి చేసిన సహాయం ఏంటి ? ఇంత‌కు దొంగ‌త‌నం చేసిందెవ‌రు? దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రేస‌ర్ దేవ్‌ (కార్తికేయ‌), పెన్సిల్‌కి మ‌ధ్య గొడ‌వేంటి ? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఈ చిత్రంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ ఆల్రెడీ ఆర్టిస్టులుగా నిరూపించుకున్న‌వాళ్లే. రైట‌ర్ పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని నేచురల్ నటనకు కనబరిచి ఆకట్టుకున్నారు. అత‌ని ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి, బామ్మ‌గా ల‌క్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మ‌గా శ‌ర‌ణ్య‌, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్య‌క్తి ప్రియాంక‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేశారు. రేస‌ర్ పాత్ర‌లో కార్తికేయ లుక్ ఆకట్టుకుంది. ఓ వైపు త‌ప్పు చేశాన‌న్న బాధ‌తో లోలోప‌ల భ‌య‌ప‌డుతూ, మ‌రోవైపు రేస‌ర్‌గా లైమ్‌లైట్‌లో ఉండే పాత్ర‌కు అత‌ను చ‌క్క‌గా సూట్ అయ్యాడు. వెన్నెల‌కిశోర్ ఈ సారి ఇంకో వైవిధ్య‌మైన పాత్ర‌లో చేశారు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు విక్రమ్ కే కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. రీరికార్డింగ్ మెప్పించింది. అనిరుద్ చేసిన సంగీతం ఫరవాలేదు. నటీనటులు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరాప‌నిత‌నం, కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. క‌థ‌, క‌థ‌నం, పాట‌లు, గ్రిప్పింగ్‌ లేని స‌న్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్లు. లొకేష‌న్లు కూడా నేచుర‌ల్‌గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ ప‌రంగానూ నేచురాలిటీ క‌నిపిస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్‌గానే సాగింది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి మ‌ళ్లీ రొటీన్ అన్పిస్తుంది.

రేటింగ్ : 2.5/5

Related posts