telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్” కొరియన్ మూవీ కాపీ… స్పందించిన నాని

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే “నాని “గ్యాంగ్ లీడర్” ఓ కొరియా సినిమా నుంచి లేపారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. “Girl Scout” అని 2008లో వచ్చిన ఓ చిత్రం స్టోరీలైన్ ని, కామెడీని తీసుకుని ఈ కథ తయారు చేసినట్లు చెప్తున్నారు. ఈ విషయమై నాని మీడియా తో మాట్లాడారు. ఓ కొరియన్‌ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ‘గ్యాంగ్‌లీడర్‌’ చేశారట ? అని మీడియావారు అడగగా… హీరో నాని స్పందిస్తూ “అది ఏ సినిమానో మీరే చెప్పండి. ప్రతి వాళ్లకు ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది. ఎవరో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. దాన్ని మీరే సరిచూసుకోవాలి” అని తేల్చి చెప్పారు. “Girl Scout” కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అయితే అనుకోని విధంగా ఆ డబ్బుని తీసుకుని ఒకరు జంప్ అయ్యిపోతారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురు ఆ డబ్బు పట్టుకుని పారిపోయిన వ్యక్తిని ఎలా పట్టుకునేరనే పాయింట్ తో కథ జరుగుతుంది. అయితే తెలుగు నేటివిటిని అద్ది ఈ కథను సాన పట్టి స్క్రీన్ ప్లే రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగితే సరిపోతుంది.

Related posts