telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ లక్కీ నెలలోనే .. ‘గ్యాంగ్‌ లీడర్‌’ గా నాని…

nani with gang leader in his lucky month

మరోసారి నటుడు నాని తన లక్కీ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సెప్టెంబరు 13న విడుదల కాబోతోంది. ఇదే నెలలో ఆయన హిట్లు ‘అష్టా చమ్మా’, ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఇదే నెలలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ విషయాన్ని నాని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ”అష్మా చమ్మా’, ‘భలే భలే మగాడివోయ్‌’.. నేను సెప్టెంబరును మిస్‌ అవుతున్నా. ఇప్పుడు ఇదే నెలలో ‘గ్యాంగ్‌ లీడర్‌’తో మీ ముందుకు రాబోతున్నా’ అని నాని ట్వీట్‌ చేశారు.

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకుడు. అనిరుధ్‌ బాణీలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 30న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ‘సాహో’ కోసం వాయిదా వేసినట్లు నాని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘సాహో’ మన సినిమా. అది విజయం సాధిస్తే మనమంతా సంబరాలు చేసుకుంటాం. ప్రభాస్‌ అన్నకు ఆల్‌ ది బెస్ట్‌. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’ అని నాని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Related posts