telugu navyamedia
telugu cinema news

అస్సలు వదలొద్దు… ఇంటర్ ఫలితాలపై నాని

nani

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బోర్డు అవకతవకల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఫెయిలైన 3 లక్షల 25 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు మే 15 లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు కట్టిన డబ్బులను రీఫండ్ చేస్తామని చెప్పింది.

కాగా అకారణంగా తాము ఫెయిలయ్యామని తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇంటర్ విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు పలువురు సినీ సెలబ్రిటీలు ముందుకువస్తున్నారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఈ ఉదంతంపై స్పందించి విద్యార్థులకు ధైర్యాన్ని ఇచ్చారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన నాని ‘‘చదువు అంటే మార్కుల పత్రాలు కాదు. నేర్చుకోవటం మాత్రమే. అర్హత సాధించని ప్రతీసారీ తిరిగి పోరాటం చేయండి. అస్సలు వదలొద్దు. జీవితంలో మార్కుల కంటే విలువైనవి చాలా ఉన్నాయి. ఒక్కసారి మిమ్మల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వాళ్ళు ప్రేమించేది మీ ఇంటర్ ఫలితాలను చూసి కాదు.. మిమ్మల్ని చూసి’’ అని పేర్కొన్నారు నాని.

Related posts

నడిగర్‌ సంఘానికి .. ప్రత్యేక అధికారి .. అవసరం లేదన్న పెద్దలలేఖ..

vimala p

నాగ చైతన్యతో “ఆర్ఎక్స్ 100” దర్శకుడు… టైటిల్ ఇదే ?

vimala p

బ్రేక్ అప్ గురించి.. ఇలియానా ముచ్చట్లు…

vimala p