telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

డబ్బుకోసం బైలింగ్వెల్‌ సినిమా చేయలేదు .. : నాని

Gang-Leader

నాచురల్ స్టార్ నాని కెరియర్ చాలా సాఫీగా సాగిపోతుంది. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లను రాబడుతున్నాయి. నాని చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన చివరగా నటించిన సినిమా “జెర్సీ” మంచి విజయం సాదించింది.ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన “గ్యాంగ్ లీడర్” విడుదల సిద్దంగా ఉంది.ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ సినిమా సరదాగా సాగిపోయే కథ.అందులో విక్రమ్ మార్క్ టేకింగ్ ఉంటుంది. కామెడీ సన్నివేశలను విక్రమ్ చాలా బాగా తెరకెక్కించాడు.ఓ బేబి ఫెం లక్ష్మీ గారు చాలా బాగా నటించారు. ఆమెకు నాకు కామెడీ టైమింగ్‌ చాలా బాగా సింక్ అయ్యింది. మా మద్య వచ్చే సన్నివేశలు అందరిని ఆకట్టుకుంటాయి.

సినిమాలో కార్తికేయ చేసిన క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది.విక్రమ్ కథ చెప్పినపుడు కార్తికేయతో పాటు కొందరు హీరోలను అనుకున్నాం కానీ చివరకు కార్తికేయ చేసాడు. ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక కొత్త కార్తికేయ ను చూస్తారు. అనిరుద్ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. విడుదల చేసిన పాటలకు మంచి ఆదారణ లభించింది. ఇంతకు ముందు బైలింగ్వెల్‌ సినిమా చేసినపుడు అని సరిగా ఆడలేదు. ఆ సినిమాల తాలూకు ఫలితాలు నా కెరియర్ పై పడ్డాయి. అందుకే నాకు బైలింగ్వెల్‌ సినిమా అంటే భయం. బైలింగ్వెల్‌ సినిమా చేయలంటే రెండు ప్రాంతల ప్రజలను తాకే అంశాలు ఆ స్క్రిప్ట్‌లో ఉండాలి. అల అయితేనే ఆ సినిమా రెండు ప్రాంతలలో విజయం సాధిస్తుంది. అంతే కానీ డబ్బులు వస్తాయని బైలింగ్వెల్‌ సినిమా చేయడం కరెక్ట్‌ కాదు, నేను హీరోగా కెరియర్ మొదలుపెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ స్థాయిలోకి రావడానికి చాలా కష్టపడ్డాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.

Related posts