telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీకాంత్ అడ్డాలతో నాని సినిమా… క్లారిటీ ఇచ్చిన నేచురల్ స్టార్

Nani

గతకొన్ని రోజులుగా నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. “బ్ర‌హ్మోత్స‌వం” డిజాస్ట‌ర్ కావ‌డంతో శ్రీకాంత్ అడ్డాలకు డైరెక్ష‌న్‌ అవ‌కాశాలు క‌నుమ‌రుగ‌య్యాయి. ఈ మ‌ధ్య శ్రీకాంత్ అడ్డాల “కూచిపూడివారి వీధి” అనే టైటిల్‌తో ఓ క‌థ‌ను సిద్ధం చేశార‌ని, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నాని హీరోగా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అభిమానులు ఈ విష‌యాన్ని నాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నాని స్పందిస్తూ “ఫాల్స్ న్యూస్ మై బాయ్స్‌” అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు. దీంతో నాని, శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో సినిమా రాబోతుంద‌నే వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో “నాని గ్యాంగ్ లీడ‌ర్‌” సినిమాతో పాటు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో “వి” సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు నేచుర‌ల్ స్టార్ నాని.

Related posts