telugu navyamedia
సినిమా వార్తలు

నాని “జెర్సీ” ఎంత రాబట్టాలంటే…?

Jersey

గౌతమ్ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అయితే సినిమా ప్రీ రిలీజ్ 26కోట్లు దాటేయడంతో వీకెండ్ కలెక్షన్స్ పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఈనెల 19న సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ కాంచన-3 కూడా అదే రోజు విడుదల కానుండడంతో సినిమాకు గట్టి పోటీ ఏర్పడింది. అయితే జెర్సీ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా నాని సినిమా మంచి రేటుకు అమ్మడు పోయింది. మొత్తంగా 30 కోట్ల షేర్స్ రాబడితేనే నాని సినిమా కమర్షియల్ గా హిట్టయినట్లు.

ఆంధ్రా, తెలంగాణ – రూ. 20.10 కోట్లు
నైజం+ఉత్తరాంధ్ర – రూ. 10 కోట్లుCr
సీడెడ్ – రూ. 3.20 కోట్లు
ఈస్ట్ – రూ. 1.60 కోట్లు
వెస్ట్ – రూ. 1.25 కోట్లు
కృష్ణ – రూ. 1.45 కోట్లు
గుంటూరు – రూ. 1.80 కోట్లు
నెల్లూరు – రూ. 0.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 1.90 కోట్లు
ఓవర్సీస్ – రూ. 4 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – రూ. 26 కోట్లు

Related posts