telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” 20 సార్లు చూశాను : నాని

Jersey

గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం “జెర్సీ”. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం నాని బాగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే నాని కావాలని బరువు తగ్గలేదట… క్రికెట్ ఆడి, దానికి సంబంధించిన కసరత్తులు చేయడం వల్ల తనకు తెలియకుండానే బరువు తగ్గిపోయాడట.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాని చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 20 సార్లు చూశానని, స్క్రీన్ మీద ఉన్నది తాను కాదన్నట్లు మైమరచిపోయి మరీ సినిమా చూడడం ఇదే మొదటిసారి అని, ఎప్పుడు ఏ సినిమా చూసినా ఎక్కడో ఒకచోట నాని కన్పించేవాడని, కానీ ఈ సినిమాలో మాత్రం ప్రేక్షకులు కేవలం అర్జున్ నే చూస్తారని, “జెర్సీ”లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు లైవ్ లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చాడు నాని. ఈ సినిమా తన లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ జర్నీ అని, నటుడిగా తనకు ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపాడు నాని.

Related posts