telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూప‌ర్ హిట్ అయితే లేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయొద్దు… : నాని

Nani

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మనం తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేని విక్రమ్ కే కుమార్.. గ్యాంగ్ లీడర్ సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు. సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. చిత్రం విడుద‌ల నేప‌థ్యంలో నాని ల‌క్ష్మీ భుజంపై ప‌డుకొని ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ “సినిమా సూప‌ర్ హిట్ అయితే లేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయొద్దు. ఈ సినిమా త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా” అని పేర్కొన్నాడు నాని. చిత్రంలో నాని పెన్సిల్ పార్ధ‌సార‌థి పాత్ర‌లో క‌నిపించి సందడి చేస్తున్నాడు.

Related posts