telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డిఫెరెంట్‌ టైటిల్‌తో వచ్చేస్తున్న నాచురల్‌ స్టార్‌ నాని

నాచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం వరుసల విజయాలతో దూసుకుపోతున్నాడు. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్‌గా హిట్స్‌ అందుకుంటున్నాడు. నాని ఇటీవల నటించిన 25వ చిత్రం ‘వి’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజ్‌ అయింది. ఈ మూవీకి మంచి టాక్‌ వచ్చింది. అయితే.. నిన్ను కోరి సినిమాతో హిట్‌ అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలోనే నాని తర్వాత సినిమా “టక్‌ జగదీష్‌” సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాను ప్రకటించేశాడు నాని. “అంటే సుందరానికి” అనే టైటిల్‌ తో నాని మరో సినిమాను అనౌన్స్‌ చేసేశాడు. ఈ సినిమా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. నవీన్‌ ఏర్నేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తీసుకొస్తోంది. ఈ సినిమాలో నజరియా హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభకానుంది.

Related posts