telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో నాని సినిమా…!

V

ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేద థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. రోజు రోజుకు కరోనా ప్రభావం ఎక్కువవుతుంది. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో ఇప్పుడు ‘వి’ మేకర్స్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యారు. తాజాగా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘వి’ మేకర్స్ కి దాదాపు రూ.30 నుండి రూ. 35 కోట్లకి మధ్య ఆఫర్ చేసినట్లు సమాచారం. మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది మేకర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పుకోవాలి. దాంతో ఓటీటీ రిలీజ్ కు ‘వి’ టీమ్ సిద్ధమయ్యారని తెలుస్తుంది. కాగా ఇది నానికి 25 వ సినిమా కాగా, ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ఇది మూడో సినిమా. గతంలో అష్టచమ్మా, జెంటిల్ మెన్ అనే చిత్రాలు వచ్చాయి.

Related posts