telugu navyamedia
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ పై నాని స్పందన

nani

“జెర్సీ”తో నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నాని క్రియేటివ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు “గ్యాంగ్ లీడ‌ర్‌” టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గురించి గ‌తంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ టైటిల్ వాడుకోవ‌డానికి వీల్లేదంటూ నానిపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు చేశారు.

తాజాగా “జెర్సీ” సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న నాని మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ పై స్పందిస్తూ… “గ్యాంగ్ లీడ‌ర్‌` సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ క‌థ‌కు, విక్ర‌మ్ కుమార్ సినిమా క‌థ‌కు అస‌లు సంబంధం లేదు. అయితే ఆ క‌థ‌కు ఆ టైటిల్ స‌రిగ్గా స‌రిపోతోంది. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ ఆ విష‌యం అంగీక‌రిస్తారు. ఆ సినిమాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` కంటే మెరుగైన టైటిల్ ఉండ‌ద‌ని అంద‌రూ అంటారు. ఆ టైటిల్ గురించి న‌న్నెవ‌రూ విమ‌ర్శించ‌లేదు. మెగాఫ్యాన్స్ న‌న్ను ట్రోల్ చేయలేదు” అని నాని చెప్పాడు.

Related posts