telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేడు .. నానే బియ్యం బతుకమ్మ..

nane biyyam batukamma today

తెలంగాణ ఆడబిడ్డలు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి. రంగు రంగుల పూలతో ప్రతీ లోగిలి శోభాయమానంగా వెలుగొందుతోంది. తెలంగాణ ఆడబిడ్డలు ఆడంబరంగా జరుపుకునే నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మకు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.

ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు అంటే నాలుగు అంతస్థులుగా బతుకమ్మను పేర్చి పూల పైన గౌరమ్మను పెట్టి ఆడబిడ్డలంతా ఆట పాటలతో బతుకమ్మను కొలుచుకుంటారు. నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి..ప్రసాదంగా పెట్టి వాయనాలుగా పంచుకుంటారు. ప్రకృతిని, పూలను ఆరాధించే అత్యంత అరుదైన ఈ పండుగ తెలంగాణలో మాత్రమే కన్నులనిండుగా జరుగుతుంది. ఊళ్లన్నీ పూల కోలాహలంగా మారిపోయాయి.

Related posts