telugu navyamedia
సినిమా వార్తలు

టిక్ టాక్ లు చేసి బాధపెట్టడం దారుణం… నందితాశ్వేత కామెంట్స్

Nandita-Swetha

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నందిత శ్వేతా. తన కెరీర్ లో ట్రోలింగ్ వల్ల బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయంటోంది ఈ బ్యూటీ. తనకు సినిమాలు తగ్గిపోయాయని, సినిమాలు ఎందుకు చేయడం లేదంటూ టిక్ టాక్ లు చేస్తున్నారని, అవి తనను బాగా ఇబ్బంది పెడుతున్నాయని, సినిమాలు చేయనంత మాత్రాన ఖాళీగా ఉన్నట్లు కాదని, తనకు కూడా పనులు ఉంటాయని, ఇలా టిక్ టాక్స్ చేయడం చాలా ఘోరమని, కేవలం చదువు కోసం మాత్రమే బ్రేక్ తీసుకున్నానని, స్టార్స్ తో ఎందుకు నటించడం లేదని అడిగినప్పుడు కూడా బాధేస్తుందని చెప్పింది. నటిగా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని, తను కూడా అదే చేస్తున్నట్లు తెలిపింది. మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో తనకు అన్నీ హారర్ పాత్రలే వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే ఆ జోనర్ నుండి బయటకొస్తున్నామని, త్వరలోనే ఓ స్టార్ హీరో సరసన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related posts