• Home
  • Trending Today
  • కాళ్ళు విరగ్గొడతానంటూ కృష్ణవంశీ వార్నింగ్… కృష్ణవంశీ, నందినిరెడ్డి మధ్య వార్…
Trending Today సినిమా వార్తలు

కాళ్ళు విరగ్గొడతానంటూ కృష్ణవంశీ వార్నింగ్… కృష్ణవంశీ, నందినిరెడ్డి మధ్య వార్…

nandini-reddy

అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన నందినిరెడ్డి ఆ తరువాత జబర్దస్త్, కళ్యాణవైభోగమే లాంటి వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. చంద్రలేఖ సమయం నుంచి నందిని రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురారి షూటింగ్ సమయంలో కృష్ణవంశీకి తనకు మధ్య జరిగిన గొడవ గురించి బయటపెట్టింది నందినిరెడ్డి. అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందనే విషయాన్ని ప్రేక్షకులకు వివరించారు. సోనాలి బింద్రే మోకాళ్ల మీద కూర్చొని మహేష్ బాబును చూస్తూ బింద్రే కొంగు తీయాలి… అది సీన్… అయితే కృష్ణవంశీ గారికి అది చెప్పడం రాక నందినిరెడ్డిని పిలిచి షాట్ గురించి చెప్పమన్నారట. కానీ నేను చెప్పనని ఖరాకండీగా చెప్పేసిందట నందినిరెడ్డి. అప్పుడు ఆయన చెప్తావా? లేదా అని నాపై గట్టిగా అరవడంతో అమ్మాయిలే ఎందుకు అలా చేయాలి ? అని కృష్ణవంశీని అడిగిందట.

కృష్ణవంశీ “నా సర్వస్వం నీకే అర్పిస్తున్నా అని మీనింగ్ తెలుపడానికి అలా చేయాలనీ..” సమాధానం చెప్పారట. వెంటనే నందినిరెడ్డి “అయితే అలాంటప్పుడు అబ్బాయిలు సర్వస్వం ఇవ్వాలంటే ప్యాంట్ విప్పుతారా? ” అని అడిగేసిందట కృష్ణవంశీని. అప్పుడు కృష్ణవంశీగారు ” వెళ్లి నేను చెప్పింది చెప్పు… లేకపోతే కాళ్లు విరగ్గొడతా…” అంటూ కోపంగా అన్నారు. తిరిగి మరో మాట మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయాను అని నవ్వుతూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నందినిరెడ్డి.

Related posts

“పడిపడి లేచే మనసు” రిలీజ్ డేట్ ఫిక్స్

vimala t

బాలయ్యను చంపేసిన గూగుల్ తల్లి…!?

vimala t

పద్మావతితో రణవీర్… షాకింగ్ !

admin

Leave a Comment