telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముఖ్యమంత్రిగా బాలయ్య ?

no more movies in near future by balakrishna

ప్రస్తుతం బాలకృష్ణ ‘రూలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సీనియర్ దర్శకుడు కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. సీకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. వచ్చే నెల 20న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆ తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదొక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో నందమూరి బాలయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నటిస్తారట. బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని, వాటిలో ఒక పాత్ర సీఎం అని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కనిపించబోతున్నారట. అయితే ఈ సినిమా పొలిటికల్ డ్రామా కాదట. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో సీఎం పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

Related posts