telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలయ్య 107వ సినిమా

b.gopal

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఇది బాలయ్య 106వ సినిమా. 107వ సినిమాను సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో చేయనున్నాడని సమాచారం. వీళ్ల కలయికలో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సూపర్ డూపర్ హిట్స్, మరోసారి ఈ కాంబో రిపీట్ కానుందని ఫిలింనగర్ సమాచారం. బాలయ్యతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బి.గోపాల్ అందుకు తగ్గ కథా కథనాలు రెడీ చేశారని, మే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Related posts