telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి అభిమానులకు షాకిస్తున్న మోక్షజ్ఞ లుక్

Mokshagna

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికీ మంచి క్రేజ్ టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. అయితే నందమూరి అభిమానులు బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండు మూడేళ్లుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దశలో బాలయ్య కూడా మరో ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్‌ అంటూ అభిమానులను ఊరించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ అతిధి పాత్రలో నటిస్తాడన్న ప్రచారం చాలా గట్టిగా వినిపించింది. అయితే అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. తరువాత ఒకటి రెండు సార్లు పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో కనిపించి మోక్షజ్ఞ లుక్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీపై అనుమానాలు కలిగించింది. ఇంకా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు పూర్తిగా సిద్ధం కాలేదు. బొద్దుగా కనిపించి అభిమానులను తీవ్రస్ధాయిలో నిరాశపరిచాడు. ఇటీవల బయటకు వచ్చిన నందమూరి వారసుడి ఫోటోలు చూసిన అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని ఫిక్స్‌ అయ్యారు. మోక్షజ్ఞకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే సినిమాలకు సిద్ధం కావటం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న మోక్షజ్ఞ సినిమా విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బాలయ్య వారసుడి తెరంగేట్రం ఇక లేనట్టే. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలో మోక్షజ్ఞ లుక్‌ చూస్తే ఇదే అనిపిస్తుంది. బాలయ్య ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలో మోక్షజ్ఞ ఏ మాత్రం ఫిట్‌గా లేని బాడీతో దారుణంగా ఉన్నాడు. ఆ లుక్‌లో ఇప్పట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు.

Related posts