telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్ సింహా బర్త్ డేను సెలెబ్రేట్ చేసిన బాలయ్య

NBK

టాలీవుడ్ ప్రముఖ గాయకుడు సింహా తన జన్మదినోత్సవాన్ని బాలయ్య సమక్షంలో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. సింహా పుట్టినరోజును నందమూరి బాలకృష్ణ స్వయంగా సెలబ్రేట్ చేసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది శ్రేయాస్ గ్రూప్. బాలయ్య, సింహా కలిసి త్వరలో ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని ట్వీట్ చేసింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు “మోనార్క్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య ఓ పాట కూడా పాడారట. బాలయ్యతో పాటు సింహా కూడా గొంతు కలిపినట్టు తెలుస్తోంది. బాలయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఆ పాట విడుదల కాబోతోందని సమాచారం.

Related posts