telugu navyamedia
telugu cinema news

బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో బాలయ్య పుట్టిన రోజు వేడుకలు

no more movies in near future by balakrishna

స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకుని, గత నాలుగు దశాబ్దాలుగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.. నటసింహా నందమూరి బాలకృష్ణ.. జూన్ 10న బాలయ్య 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించిన బాలకృష్ణకు మంగమ్మగారి మనవడు హీరోగా బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడినుండి వరస సినిమాలతో, తిరుగులేని మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు..ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, నారీనారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, భైరవద్వీపం, ఆదిత్య 369, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి.. ఇలా ఆయన జీవం పోసిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యడం, తన అసమాన నటనతో పోషించే పాత్రకు పరిపూర్ణ న్యాయం చెయ్యడం బాలయ్యకు తండ్రినుండి వచ్చిన గొప్ప గుణం.. మంచి లక్షణం..

సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ, తన రికార్డులను తానే తిరగరాస్తూ, జయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా, దర్శక, నిర్మాతల హీరోగా మంచితనంతో మెలుగుతూ 100 సినిమాలు పూర్తి చేసాడు.. తన జెనరేషన్ హీరోల్లో.. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే.. నాకు నేనే పోటీ, నాకెవరూ రారు సాటి.. అని ఎన్నో సందర్భాల్లో నిరూపించాడు బాలయ్య..తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసాడు. ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్మేగా గెలుపొందాడు. సినిమాలు, ప్రజాసేవతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న బాలయ్య, తన 105వ సినిమాని కె.ఎస్.రవికుమార్‌తో, 106వ సినిమాని బోయపాటి శ్రీనుతో చెయ్యబోతున్నాడు. కల్మషం తెలియని మనసు, స్వార్థం లేని ప్రేమ, నిండైన చిరునవ్వు బాలయ్య ఆభరణాలు.. ఆయన భోళా శంకరుడు.. అభిమానుల పాలిట దేవుడు.. సినిమా, రాజకీయ రంగాలలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ.. బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ క్యాన్సర్ బాధిత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ప్రసంగించారు.

Related posts

‘ మజిలీ ‘ ట్రైలర్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.. చైతు,

ashok

బిగ్ బాస్ బ్యూటీపై చీటింగ్ కేసు

vimala p

కన్నడ హీరోల ఇళ్లల్లో ఐటీ దాడులు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం?

vimala p